జగిత్యాల జిల్లా: rtn.sircilla srinivas
స్వామి వివేకానంద చెప్పినట్లుగా….ఎక్కడ నమ్మకముంటుందో అక్కడ ఆలోచనలుంటాయ్…అవే ఆలోచనలు ఆచరణ సాధ్యమౌతాయ్…అదే ఆచరణ అలవాటుగా మారుతుంది…అదే అలవాటు వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.అదే వ్యక్తిత్వం గమ్యాన్ని చేరుస్తుంది.
సామాజిక సేవ-విద్యార్థుల అభ్యున్నతే రోటరీ ధ్యేయం అని జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ అన్నారు.

రోటరీ క్లబ్, సైనిక్ పురి, సికింద్రాబాద్ వారు ఓల్డ్ హైస్కూల్ పూర్వ. విద్యార్థి, రోటరీ రీజనల్ చైర్మెన్ (నూతన క్లబ్ ల ఏర్పాటు) కోటగిరి అమర్ నాథ్ సహకారం తో ఓల్డ్ హైస్కూల్ బాలికలు 50మందికి సైకిళ్లను అందించారు.

స్థానిక ఓల్డ్ హైస్కూల్ లో …గురువారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ పాల్గొని, బాలికలకు సైకిళ్లను అందించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ..రోటరీ క్లబ్ సైనిక్ పురి అధ్యక్షుడు ఎం.శ్రీహరి, పూర్వ అధ్యక్షుడు మునికుమార్,రోటరీ 3150 గవర్నర్ నామినీ ఎం.హన్మంతరెడ్డి, రీజనల్ చైర్మెన్ (నూతన క్లబ్ ల ఏర్పాటు) కోటగిరి అమర్ నాథ్, కోశాధికారి బద్రినాథ్ కృష్ణ మరియు ఎంఈఓ నారాయణ,

జగిత్యాల రోటరీ క్లబ్ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టివి.సూర్యం, ఆంటోని ముత్తు, ఎన్.రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పద్మాకర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ…సామాజిక సేవకు ఎల్లలు లేవనీ..ప్రజాప్రతినిధిగా సేవ చేయడానికి అవకాశం కల్పించింది, సామాజిక సేవయేనన్నారు.

రోటరీ 3150 గవర్నర్ నామినీఎంహన్మంతరెడ్డి మాట్లాడుతూ…
స్వామి వివేకానంద చెప్పినట్లుగా….
ఎక్కడ నమ్మకముంటుందో అక్కడ ఆలోచనలుంటాయ్…అవే ఆలోచనలు ఆచరణ సాధ్యమౌతాయ్…అదే ఆచరణ అలవాటుగా మారుతుంది…అదే అలవాటు వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది.అదే వ్యక్తిత్వం గమ్యాన్ని చేరుస్తుంది. అందుకే ప్రతీ విద్యార్థి నమ్మకం నుండి సరైన గమ్యం చేరుకోవాలంటే…సరైన దిశలో పయనించాలన్నారు.

