జగిత్యాల:
ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుండి జగదీశ్వర్ శర్మకు స్థానం
పద్మశాలి సేవా సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో…వాగ్గేయకారుల స్వరనీరాజనం…భక్తి సంగీత విభావరిని స్థానిక మార్కండేయ దేవాలయంలో నిర్వహించారు.

శనివారం రాత్రి 7-15 నుండి 9-15 వరకు రెండు గంటలపాటుగా సంగీత విభావరి లో భక్తి పాటలను గుండి జగదీశ్వర్ శర్మ గానం చేశారు. ఆయనకు తోడుగా కరీంనగర్ కు చెందిన టివి గాయని శ్రీమతి లలితా ప్రసాద్ సహకరించారు.

రెండు గంటల గానాలాపాన అనంతరం, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో జగదీశ్వర్ శర్మకు స్థానం కల్పించినట్లు సంస్థ ఇండియా చీఫ్ కో-ఆర్డినేటర్ (హైదరాబాద్)లు డా.బింగి నరేందర్ గౌడ్, శ్రీమతి జి.స్వర్ణశ్రీ లు ప్రకటించారు.

ఈ సందర్భంగా, కార్యక్రమానికి హాజరైన శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ చేతులమీదుగా, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవ పత్రాన్ని, జ్ఞాపికను, ఒక మెడల్ ను ప్రదానం గావించారు.

ఈ కార్యక్రమంలో…ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటుగా టియుడబ్ల్యుజె రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్,శ్రీ ఛానల్ నిర్వాహకులు గుగ్గిళ్ల నాగభూషణం, వ్యాపారవేత్త రేగొండ నరేష్, కళాశ్రీ గుండేటి రాజు, మాజీ కౌన్సిలర్ రేపల్లె హరికృష్ణ, తో పాటుగా పద్మశాలి సేవా సంఘం నాయకులు ఒల్లాల గంగాధర్ సంఘ సభ్యులు బోగ చిన్న గంగాధర్, ఆడెపు సత్యం, రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.