అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో.. తెలంగాణ ముందువరుసలో.. మంత్రి కేటీఆర్

0
73

న్యూ డిల్లీ:

దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

దిల్లీలో పౌర విమానయానశాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘వింగ్స్ ఇండియా 2020’ సన్నాహక సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. ఐదేళ్లుగా అభివృద్ధిలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు ఎక్కువగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

ఐటీ, రక్షణరంగ ఉత్పత్తుల కంపెనీలకు హైదరాబాద్ చక్కని గమ్యస్థానం అని చెప్పారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు కొలువుదీరాయని అన్నారు.

రాష్ట్రంలోని ద్వితీయస్థాయి నగరాల్లోనూ విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని కేటీఆర్ వివరించారు.

రాష్ట్రంలోని ఆరు పట్టణాల్లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ప్రఖ్యాతిగాంచిన విమాన, రక్షణరంగ సంస్థలు హైదరాబాద్ లో శాఖలను ఏర్పాటు చేసుకుంటున్నాయని వివరించారు.

ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ యూనివర్సిటీ స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఆతిథ్యం :

హైదరాబాద్ బేగంపేట్ లో మార్చి 12 నుంచి 15 వరకు జరగనున్న వింగ్స్ ఇండియా సదస్సుకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సులో భాగంగా ప్రపంచ వైమానిక సదస్సును ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ వైమానిక రంగం భాగస్వామ్య కంపెనీలు ఇందులో పాల్గొననున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here