0
100

గవర్నర్ చేతుల మీదుగా “స్టేట్ డెమొక్రసీ” అవార్డులు అందుకున్న జగిత్యాల అధికారులు

By Siricilla Srinivaas 

హైదరాబాద్: (జగిత్యాల): 

Good..congratulations to all of my officers ..Dist. Collector Dr. A.Sharath IAS

జగిత్యాల జిల్లాకు చెందిన కుందారపు లక్ష్మినారాయణ ( డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి)తో పాటుగా ముగ్గురు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఒక మండల పంచాయతీ అధికారి , ఒక ఎస్ ఐ తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డులను రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై చేతులమీదుగా అందుకున్నారు.

– రాష్ట్ర వ్యాప్తంగా 181 మందికి ఈ అవార్డులను ఎన్నికల కమిషన్ ప్రకటించిన సంగతి తెల్సిందే.

గత పంచాయత్ రాజ్ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ స్టేట్ డెమొక్రసీ అవార్డులను ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 181 మంది అధికారులకు ఎన్నికల కమిషన్ అవార్డులు ప్రకటించగా….వీరిలో జగిత్యాల జిల్లా నుంచి అప్పటి జిల్లా పంచాయతీ అధికారి గాఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించిన

కుందారపు లక్ష్మినారాయణ ( డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి)తో పాటుగా

మండల పరిషత్ అభివృద్ధి అధికారులు

  • శ్రీమతి జి.కల్పన (మెట్ పల్లి),
  • కె.నవీన్ కుమార్ (గొల్లపల్లి),
  • బి.రమేష్ (కొడిమ్యాల)
  • కె.భీమేష్ (మండల పంచాయతీ అధికారి మల్లాపూర్),
  • వెల్గటూర్ ఎస్ ఐ టి.శ్రీనివాస్ లకు “తెలంగాణ స్టేట్ డెమొక్రసి అవార్డు” లను అందుకున్నారు.

ఈ అవార్డులను శనివారం హైదరాబాద్ లోని ఇబ్రహింబాగ్, తారామతి-బారాదరి ఆడిటోరియం హాల్ లో గవర్నర్ శ్రీమతి తమిళిసై చేతులమీదుగా అందుకున్నారు.

శుభాకాంక్షలు:

ఈ సందర్భంగా… తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ డిఆర్డీఏ అధికారి కుందారపు లక్ష్మినారాయణతో పాటు అధికారులకు శుభాకాంక్షలుఅందజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here