ఏరోస్పేస్, రక్షణ రంగాల భాగ్యనగరం మాది : ‘దావోస్’ లో మంత్రి కెటిఆర్

0
90

బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్‌కార్, రాక్‌వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్‌వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె గొయంకా, కెపిఎంజి గ్లోబల్ చైర్మన్ బిల్ థామస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సిఇఒ కళ్యాణ్‌కుమార్‌లతో ‘దావోస్‌’లో మంత్రి కెటిఆర్ చర్చల

ఏరోస్పేస్, రక్షణ రంగాల భాగ్యనగరం మాది : కెటిఆర్

దావోస్:

దావోస్ పర్యటనలో భాగంగా రెండవ రో జు మంత్రి కెటిఆర్‌తో పలు ప్రపంచ ప్ర ఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల సిఇఒలు, గ్రూప్ చైర్మన్లు పాల్గొన్నారు. దావోస్ లో జరిగిన ఒక బిజినెస్ మీటింగ్‌లో గూగుల్, ఆల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ తో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు.

హైదరాబాద్ నగరంలో గూగుల్ కార్యకలాపాలతో పాటు, దాని భవిష్యత్తు విస్తరణపైన ఈ సందర్భంగా వారు చర్చించారు. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫె న్స్ కంపెనీ అయిన బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్ కార్ కూడా కెటిఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు ప్రాధాన్యత రంగాలని చైర్మన్‌కు కెటిఆర్ తెలియజేశారు.

ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు.

రాక్ వెల్ ఆటోమేషన్ సిఇఒ, ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్ కూడా కెటిఆర్‌ను కలిశారు.

230 సంవత్సరాల చరిత్ర కలిగిన జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షులు రాజీవ్ వెంకయ్య కెటిఆర్‌తో ప్రత్యేకంగా సమావేమశమయ్యారు.

హైదరాబాద్ ఇండియా యొక్క లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగ రాజధానిగా ఉన్నదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పా టు చేస్తున్న ఫార్మాసిటీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కె. గోయాంక, కె పి ఎం జి గ్లోబల్ చైర్మన్, సిఇఒ బిల్ థామస్,హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సిఇఓ కళ్యాణ్ కుమార్‌లు సైతం మంత్రితో సమావేశం అయ్యారు.

దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న తెలంగాణ
పెవిలియన్ దావోస్‌లో పర్యటిస్తున్న పారిశ్రామిక, ప్రభుత్వ వర్గాలకు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

దావోస్ పట్టణంలోని ప్రధాన రోడ్డుకు ఆనుకుని ఏర్పాటుచేసిన ఈ పెవిలియన్‌ను అనేక మంది ప్రముఖులు సందర్శిస్తున్నారు.

భారతదేశం నుంచి తెలంగాణతోపాటు కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశాయి. తెలంగాణ ప్రభుత్వ పెవిలియన్లో ఒక రిసెప్షన్ ఏరియాతో పాటు, రెండు సమావేశ గదులు, ఒక వెయిటింగ్ ప్రాంతం ఉన్నది.

అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వర్చువల్ రియాలిటీ లాంజ్ ను సందర్శించి తెలంగాణకు సంబంధించిన వర్చువల్ రియాలిటీ ప్రెజెంటేషన్ వీక్షించే అవకాశం కూడా ఇక్కడ ఉన్నది.

తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, పారిశ్రామిక విధానం, వార్షిక నివేదికల సమాచారం కూడా తెలంగాణ పెవిలియన్లో అందుబాటులో ఉన్నది. కేవలం పారిశ్రామిక, పెట్టుబడుల సమాచారమే కాకుండా హైదరాబాద్ నగర చరిత్ర మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టూరిజం ప్రత్యేకతలను కూడా పెవిలియన్ గోడలపైన అందుబాటులో ఉంచారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి కెటిఆర్‌తోపాటు పరిశ్రమలు,ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టి హబ్ సిఇఒ రవి నారాయణ్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తో పాటు పలువురు అధికారులు దావోస్ పర్యటనలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here