ప్రజా సేవకు అంకితం..నేవూరి దంపతుల జీవితం…

0
466

కార్య సాధకులు….రాజన్న సిరిసిల్ల జిల్లా (సంపత్ పంజ): “తెలంగాణ రిపోర్టర్“ప్రత్యేకం……

రాజన్న సిరిసిల్ల జిల్లా,ఎల్లారెడ్డిపేట్ మేజర్ గ్రామ పంచాయితీ కి గత 5 సంవత్సరాల కాలంలో సర్పంచ్ గా మమత వెంకట్ రెడ్డి సేవలు అందించారు. ప్రస్తుతం సర్పంచ్ గా మమత, భర్త వెంకట్ రెడ్డి సేవలు అందిస్తున్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా సామాజిక కార్యకర్తగా జిల్లాలో, మండలంలో,గ్రామంలో అనేక సేవ కార్యక్రమాలు చేపట్టారు. పేదరికంలో ఉన్న నూతన వధువు లకు పుస్తె మట్టెలు అందిస్తూ పేదోళ్ల గుండెల్లో గుడికట్టుకున్న దంపతులు మమత వెంకట్ రెడ్డిలు.

సామాజిక సేవచేస్తూ ప్రజా సేవకు అంకితం అయిన వెంకట్ రెడ్డి కి గత 5 సంవత్సరాల క్రితం తన సహధర్మ చారిణి మమతకు సర్పంచ్ గా గ్రామ ప్రజలు పట్టం కట్టారుఆమె చేసిన సేవ మహిళల్లో చిరస్థాయిగా నిలిచి… ప్రస్తుతం మమత భర్త వెంకట్ రెడ్డి కి పట్టం కట్టారు.

స్వతహాగా ప్రజాసేవే ప్రాణంగా ముందుకు వెళుతున్న వెంకట్ రెడ్డి కి సర్పంచ్ పదవి గ్రామ ప్రజలు అందించడంతో మరింత బాధ్యత గా అలుపెరుగని నాయకునిగా.. కార్యసాదకులుగా ప్రజా సేవకె అంకితం అయిన వెంకట్ రెడ్డి “వెంకన్న” గా ప్రజలకు పెద్దన్నగా, పేదోళ్లకు పెద్దకొడుకుగాపిలువ బడుతున్నాడు. పెళ్లి జరుగుతుంది అంటే పుస్తె మట్టెలు వస్తాయని అందించే ఆది దంపతులు వస్తారని ప్రజల్లో నిలిచిపోయింది.

వేసవిలో దాహార్తితో అలమటిస్తున్న గ్రామ ప్రజలకు నేను ఉన్నాను అంటూ స్వంత ఖర్చు లతో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఇంటింటికి నీరు అందించిన అపర భగీరథుడు.. “అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న” అన్న విదంగా గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా అనేక కార్యక్రమాల ద్వారా అన్నదాత.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో గ్రామంలో అనేక మొక్కలు నాటి సంరక్షణకు పెద్దపీట వేసి చెట్లను నరికితే… జరిమానాలు విధించి వృక్షో రక్షతి రక్షతిః అని చాటిన మహా వ్యక్తి.

30 రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటి, పరిసరాలను సైతం శుభ్రం చేసి,పచ్చదనమే ద్యేయంగా , మొక్కలు నాటి వాటి సంరక్షణకు దీక్షబూని ట్రీగార్డులు ఏర్పాటు చేశారు.

సింగసంద్రం లో నీరు చేరి బుంగ పడటంతో తానే స్వయంగా రైతులతో వెళ్లి నీటిలో దిగి బుంగ పూడ్చి రైతు నాయకుడిగా రైతులకు అండగా నిలుస్తున్నారు.

భవిష్యత్ తరాలకు చరిత్ర తెలియాలని, చరిత్ర మరుగున పడిపోకుండా కాకతీయుల నాటి కట్టడాలు బురుజులను సంరక్షిస్తూ, భావితరాలకు చరిత్ర గుర్తులను నిలుపుతున్న నాయకుడు .బురుజులకు త్రివర్ణ పతాకం రంగులు వేసి జాతీయ జండా ఎగురవేసి దేశ భక్తిని చాటుకున్న దేశభక్తుడు.

యువత కు ఆరోగ్యానికి సంబంధించిన చొరవ చూపి జిమ్ము ను ఏర్పాటు చేసి యువతను పెడదారిన పోకుండా చూస్తున్న వెంకట్ రెడ్డి యువత గుండెల్లో ధైర్యం అయినాడు.

గ్రామపంచాయతీ కార్మికులు జీతాలు లేక ఇబ్బందులు పడుతుంటే స్వంతంగా అప్పు తెచ్చి కార్మికులకు జీతాలు ఇచ్చిన వెంకట్ రెడ్డిి… ఇలా అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్న ఈ దంపతులకు కొన్ని సమయాల్లో రాజకీయంగా ఎదురు దెబ్బలు తగిలినా… ప్రజల ఆశీర్వాదం తో ముందుకు సాగుతూనే ఉన్నారు…

నెవూరి మమత వెంకట్ రెడ్డి దంపతుల సేవా కార్య సాధన పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here