కరీంనగర్ :
కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం విద్యార్థులతో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కరీంనగర్ లోని బోయవాడ శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులతో కమాన్ చౌరస్తా- శ్రీనివాస టాకీస్- రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతం మీదుగా ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిరుమల్ మాట్లాడుతూ రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
రోడ్డు నియమ నిబంధనలపై అన్ని వర్గాల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు ల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కల్పించాలని చెప్పారు.
రోడ్డు నియమ నిబంధనలు పాటించిన వాహనదారులకు పుష్పగుచ్ఛాలు అందించి విద్యార్థులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగార్జున ఏఎస్ఐ దత్తు తదితరులు పాల్గొన్నారు.