ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీ పాస్ అమలు: పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

0
126

హైదరాబాద్ :

ఇంటి నిర్మాణ అనుమతులను సత్వరమే ఇచ్చే లక్ష్యంతో ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీ పాస్ ను అమలు చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పౌరులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వివరించారు.

అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసి పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్ లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు పురపాలక చట్టం, పట్టణ ప్రగతిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రజల కోణంలో ఆలోచించి పరిపాలన సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ 33 జిల్లాలు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.

నాలుగేళ్లలో ఎన్నో పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. టీఎస్ బీ పాస్ తీసుకురానున్న నేపథ్యంలో మార్చిలోపు దానికి సంబంధించిన లోటుపాట్లను పరిశీలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

టీఎస్ బీ పాస్ , మీసేవతో పాటు కొత్తగా మరో యాప్ తీసుకొస్తున్నామన్నారు. ఈ మూడు ప్రక్రియల ద్వారా లేదా నేరుగా మున్సిపల్ శాఖ అధికారులను కలిస్తే ఇంటి నిర్మాణ అనుమతి లభిస్తుందని తెలిపారు.

75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. 21 రోజుల్లోనే నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలని.. ఇవ్వకపోతే ఎందుకు సాధ్యం కాలేదో దరఖాస్తుదారుడికి చెప్పాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

రూపాయికే నల్లా కనెక్షన్ విషయంలో ఏవిధమైన ఇబ్బందులూ ఉండొద్దని.. వేసవిలో నీటి కొరత రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here