టీఎస్-ఐపాస్ లో జిల్లా ప్రథమం… అవార్డునందుకున్న కలెక్టర్

0
95

జగిత్యాల జిల్లా:

పరిశ్రమలను నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన టీఎస్ –  ఐపాస్  లో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది
ఐదేళ్ల క్రితం టి ఎస్ ఐ పాస్ ఏర్పాటు చేయగా జగిత్యాల జిల్లాలో రూ 28.42 కోట్ల పెట్టుబడితో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు కు అనుమతులు ఇప్పటికే ఇచ్చారు…

8752 మందికి ఉపాధి అవకాశం ఉంది..దీంతో గణాంక లెక్కల ప్రకారం జగిత్యాలజిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.

బుధవారం హైదరాబాద్ లోని శిల్పకళావేదిక లో జరిగిన  కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి చేతులమీదుగా జిల్లా కలెక్టర్  ఎ. శరత్  అవార్డును తీసుకున్నారు..

జగిత్యాల జిల్లా టిఎస్-ఐపాస్ అమలులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 

టిఎస్-ఐపాస్ అమలు ఐదు సంవత్సరాలు పూర్తి ఐన సందర్భంలో… జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.శరత్ మరియు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి శ్రీనివాస్ లకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. 

టిఎస్-ఐపాస్ ( తెలంగాణ రాష్ట పారిశ్రామిక ప్రాజెక్ట్ ఆమోదం మరియు స్వయం ధృవీకరణ  వ్యవస్థ) TS-iPASS  తెలంగాణా ప్రభుత్వం పరిశ్రమలకు కావలసిన అన్ని అనుమతులను పొందడానికి టిఎస్-ఐపాస్ చట్టాన్ని తీసుకువచ్చి దాన్ని ఒక సంపూర్ణమైన ఆన్ లైన్ వ్యవస్థ గా రూపొందించింది..

దీని ద్వారా పారిశ్రామిక  అనుమతులు పొందడానికి పెట్టుబడిదారులకు చట్టబద్ధమైన హక్కును  కల్పించింది. అన్ని అనుమతులను పొందడానికి గరిష్టంగా 30 రోజుల్లో పొందే వీలును కల్పించింది. 

ఏ ఒక్క కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఏ అధికారినీ కలవాల్సిన అవసరం లేకుండా పటిష్టంగా ఈ టిఎస్ – ఐపాస్ రూపొందించింది.నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వని ఎడల అందుకు బాధ్యలైన అధికారులకు జరిమానా విధించే విధంగా అనుమతులను డీమ్డ్గా పరిగణించి, అనుమతులు ఇచ్చే విధంగా రూపొందించింది.

అంతేకాకుండా స్వయం ధృవీకరణ ద్వారా స్వంత పూచీకత్తుపై అనుమతులు ఇవ్వడం వల్ల నియమ నియంత్రణలను పాటించే విషయంలో పరిశ్రమ లపై కూడా బాధ్యత పెరిగింది.

ఇప్పటివరకు జిల్లాలో రూ.28.42 కోట్ల పెట్టుబడితో 98 చిరు మరియు చిన్న తరహా పరిశ్రమలకు  అనుమతులు ఇవ్వబడ్డాయి.వీటితో మొత్తం 8752 మందికి ఉపాధి అవకాశాలు కల్ప్చిబడనున్నాయి. వీటిలో 89 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభినవి. మరో 5యూనిట్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. అలాగే, త్వరలోనే మొత్తం 99 యూనిట్లు పూర్తి స్థాయిలో  పని చేయనున్నాయి.

ఈ మేరకు జగిత్యాల జిల్లా టిఎస్-ఐపాస్ అమలులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. 

టిఎస్-ఐపాస్ అమలు ఐదు సంవత్సరాలు పూర్తి ఐన సందర్భంలో… జగిత్యాల జిల్లా కలెక్టర్ డా.శరత్ మరియు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి శ్రీనివాస్ లకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.

అలాగే, జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జి.శ్రీనివాస్ కు కూడా ఈ పురస్కారం పొందారు.

శుభాకాంక్షలు:

ఈ సందర్భంగా.. జిల్లా కలెక్టర్ శరత్ కు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేశం, డిఆర్వో శ్రీమతి అరుణశ్రీ,ఆర్డీఓ గంటా నరేందర్, కార్యాలయ ఏఓ వెంకటేష్ తో పాటు కార్యాలయం ఉద్యోగులు మరియు డిఆర్డీఏ పిడి కుందారపు లక్ష్మినారాయణ,ఐసిడిఐస్ జిల్లా అధికారి బోనగిరి నరేష్,   మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సుందర వరద రాజన్, టిఎన్ జిఓ జిల్లా నాయకులు బోగ శశిధర్, ఎండి వకీల్, హరి అశోక్ కుమార్ తో పాటు పలువురు తదితరులు శుభాకాంక్షలు అందజేశారు.

Congratulations Sir…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here