నిండు జీవితానికి రెండు చుక్కలు: రాష్ట్ర పరిశీలకులు సూర్యశ్రీ

0
123

జగిత్యాల జిల్లా..

వెల్గటూర్ మండలం రాజారామ్ పల్లి,గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామాల్లో సోమవారం వలస కార్మిక ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ సూర్య శ్రీ పరిశీలించారు.

జగిత్యాల పాత కొత్త బస్టాండ్ లో పోలియో బూతులను సందర్శించి తగు సూచనలు చేస్తూ సంతృప్తి వ్యక్తం చేశారు.

పాత బస్టాండ్ సమీపంలో గల జిల్లా ఆసుపత్రి లోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి తగు సూచనలు చేస్తూ అప్పుడే పుట్టిన పసిపిల్లలకు కూడా పోలియో చుక్కలు వేయించడంపై సంతృప్తి చెందారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు తప్పనిసరి అని, అలాగే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి వేయించాలని లేకుంటే భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు.

మన రాష్ట్రం, మన దేశం పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో గొల్లపల్లి వైద్యాధికారి డాక్టర్ లవకుమార్, డిపిఓ రాజేందర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు సహకరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here