వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి సస్పెండ్ …ఆదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్…

0
4456

రాజన్న సిరిసిల్ల జిల్లా,టి రిపోర్టర్(సంపత్ పంజ):   

గత ఆరు నెలలుగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ …పశువులకు సక్రమంగా  వైద్య సేవలు అందించడంలో విఫలమైన ఎల్లారెడ్డిపేట వెటర్నరీ  లైవ్ స్టాక్ అధికారి జె . కొమురయ్య ను జిల్లా కలెక్టర్ శుక్రవారం సస్పెండ్ చేసారు.

గొల్లపల్లి లో  వెటర్నరీ  లైవ్ స్టాక్ అధికారి జె . కొమురయ్య ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్నారు . గత ఆరు మాసాలుగా విధులను సక్రమంగా నిర్వర్తించక పోవడం, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలను సమయం ప్రకారం తెరవక పోవడం వల్ల రైతులు సేవలు అందడం లేదంటూ.. ఉన్నతాధికారులకు  ఫిర్యాదులు చేసారు . అయినప్పటికీ జె . కొమురయ్య పనితీరులో మార్పు రాలేదు .

ఇది ఇలా ఉండగా శుక్రవారం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పశు వైద్యశాల  సకాలంలో తెరవడం లేదన్న విషయం కలెక్టర్ దృష్టికి వచ్చించి …. వెంటనే స్పందించిన కలెక్టర్ ఉదయం 10.30 గంటలకు ఎల్లారెడ్డిపేట  పశు వైద్యశాల వెళ్లారు . అప్పటికల్లా కార్యాలయం తెరుచుకోలేదు . 40 నిమిషాలకు పైగా అక్కడే ఉండి …. అధికారుల కోసం వేచి చూసారు. ఫోన్లో వారిని సంప్రదించారు .క్షేత్రస్థాయి విధినిర్వహణలో ఉన్నామని ఉద్యోగులు తెలుపగా …వాట్సప్ ద్వారా లోకేషన్ పంపించాల్సిందిగా హుకుం జారీ చేసారు . అరగంట సేపు వేచి చూసినా వారు వాట్సప్ ద్వారా లొకేషన్  కలెక్టర్ కు పంపలేదు . ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పలువురు రైతులతో మాట్లాడారు. పశు వైద్యశాల  వల్ల ..ప్రయోజనం లేకుండా పోయిందని పశువులు అనారోగ్యంతో మరణించినా ..పట్టించుకున్న వారే లేరు అని రైతులు కలెక్టర్ కు తెలిపారు..45 నిమిషాల అనంతరం జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటరమణ కార్యాలయం వద్దకు వచ్చారు. వెటర్నరీ  లైవ్ స్టాక్ అధికారి  జె . కొమురయ్య పని తీరు బాగా లేదని పలు మార్లు హెచ్చరించినా మార్పురావడం లేదని చెప్పారు . 

జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈ విషయంను తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అన్నారు . విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వెటర్నరీ  లైవ్ స్టాక్ అధికారి జె . కొమురయ్య ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు . జిల్లాలోని పశు సంవర్ధక శాఖ అధికారులు తమ పని తీరు మార్చుకోవాలని హెచ్చరించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here