విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు పోలీస్ శాఖ పూర్తి రక్షణ!

0
69

రామగుండం

కరీంనగర్ క మిషనరేట్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ధర్నాలు, రాస్తారోకోలు విరమించుకొని ఆర్టీసీ. డ్రైవర్లు,కండక్టర్లు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తామని karimanagar పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ సిపి రామగుండం పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు

తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు నిర్భయంగా డ్యూటీలో చేరవచ్చు, విధుల్లో చేరుతున్న ఆర్టీసీ ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా, భౌతిక దాడులకు పాల్పడినా, వారికి ఏ విధమైన నష్టం కలుగజేసినా అట్టి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని కమిషనర్ హెచ్చరించారు.

ఉద్యోగంలో తిరిగి చేరాలనుకునే వారిని ఎవరైనా ఉద్దేదపూర్వకంగా అడ్డగించినా, ఘెరావ్ చేసినా, బెదిరింపులకు పాల్పడినా వెంటనే డయల్ 100 లేదా పోలీస్ అధికారుల నెంబర్లకు ఫోన్ చేసినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్లలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here