ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరితే.. పూర్తి రక్షణ – జిల్లా ఇంచార్జ్ ఎస్పీ రాహుల్ హెగ్డే

0
82

జగిత్యాల జిల్లా…..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 5వ తేదీ లోపు

ఆర్టీసీ ఉద్యోగులను విధులలో చేరడానికి అవకాశం కలిపించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వారికి పోలీస్ శాఖ నుండి పూర్తి భద్రత కలిపిస్తాము అని జిల్లా ఇంచార్జ్ ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.

ఎవరైనా వ్యక్తులు విధుల్లో చేరిన ఉద్యోగులను బెదిరించినా,వారిపై భౌతిక దాడుల కు పాల్పడితే అట్టి వారిపై చట్టప్రకారం జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

కావున ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉంటే నిర్భయంగా చేరవచ్చును అని తెలిపారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here