సామాజిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంచాలి:రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

0
100

హైదరాబాద్: sircilla srinivas

రెడ్ క్రాస్ లో చేరిన కొత్త సభ్యులకు , యువతకు ఆరోగ్య సంరక్షణ, స్వఛ్చభారత్, మొక్కల పెంపకం, ప్రాథమిక చికిత్స, రక్తదాన కార్యక్రమాలపై అవసరమైన శిక్షణ ఇవ్వాలని రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ సూచించారు.

బుధవారం రాజ్ భవన్ లో రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలపై అన్ని జిల్లాల కలెక్టర్ లు, సొసైటి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం లో న్నూంగా దాదాపుగా 70 వేల మంది యువత రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యత్వాలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు.

కొత్తగా చేరిన వారి సేవలను వినియోగించుకుంటూ, వారికి సామాజిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంచాలన్నారు.కాగా, పలు జిల్లాల్లో రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ కు sri ramachandra mission meditation కు సంబంధించిన అవగాహన పుస్తకంను అందజేస్తున్న కృష్ణ….

ఈ సమావేశంలో…గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఉప కార్యదర్శి రఘుప్రసాద్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మెన్ ప్రకాష్ రెడ్డి, మదన్ మోహన్ తో పాటుగా పలు జిల్లా ల రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో…జగిత్యాల జిల్లా ప్రతినిధిగా రెడ్ క్రాస్, రోటరీ సభ్యులు మంచాల కృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా.. జిల్లా ప్రతినిధిగా జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కలెక్టర్ డా.శరత్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ తో సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరించారు. దీంతో గవర్నర్ హర్షం వ్యక్తంచేస్తూ…జగిత్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ…అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here