World Ayush Expo & Arogya 2019 “జీవన సాఫల్య పురస్కారం” అందుకున్న డా. హెచ్.ఎస్.పాలెప్

0
177

ముంబాయి: sircilla srinivas, 9849162111

ప్రపంచ ఆయుష్ ఎక్స్ పో & ఆరోగ్య 2019 “జీవన సాఫల్య పురస్కారం” అందుకున్న డాక్టర్ హెచ్.ఎస్.పాలెప్

అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ప్రముఖ వైద్యులు, ఆయుర్వేద పరిశోధకులు, ముంబై లో గైనకాలజిస్ట్   
*డాక్టర్ హెచ్.ఎస్.పాలెప్*
ప్రతిష్టాత్మకమైన
*World Ayush Expo & Arogya 2019* వారి *జీవన సాఫల్య పురస్కారం* అందుకున్నారు.

నవీ ముంబై లోని సిడ్కో, వాషి లో  గత నాలుగు రోజులుగా   (22 – 25) కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న ఈ మహాసభల్లో …..               

30 దేశాలు
● 10 వేల మంది ప్రతినిధులు
● దాదాపు 7 లక్షల మంది సాధారణ సందర్శకులు పాల్గొనగా,
● 50 కి పైగా సెమినార్లు నిర్వహించారు.

ఈ సందర్భంలో… శనివారం ఈ వేదిక పై  వైద్య రంగంలో విశేష కృషి చేస్తున్న పలువురు ప్రముఖ వైద్యులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఆయుష్ విభాగం సత్కరించింది.

ఈ నేపథ్యంలో….ప్రతిష్టాత్మకమైన *World Ayush Expo & Arogya 2019 వారి
*జీవన సాఫల్య పురస్కారం* ను *డాక్టర్ హెచ్.ఎస్.పాలెప్* కు ఆయుష్ అడ్వైజర్ డా.మనోజ్ నేసరి (Dr. Manoj Nesari. Advisor to AYUSH) అందజేశారు.

తెలంగాణ రిపోర్టర్ శుభాకాంక్షలు..సిరిసిల్ల శ్రీనివాస్:

Congratulations to sri Dr.HS.Palep

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని *ఆయుష్* విభాగం  నిర్వహిస్తున్న ఈ మహోత్సవంలో జగిత్యాల జిల్లా, పొలాస గ్రామంకు చెందిన, ముంబైలో వైద్యవృత్తి చేస్తున్న తెలుగు బిడ్డకు ఇంతటి మహోన్నతమైన, అరుదైన అవార్డు లభించడం ఎంతో గర్వకారణం.

ఈ సందర్భంగా… *డాక్టర్ హెచ్.ఎస్.పాలెప్*
కు *తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్, టియుడబ్ల్యుజె రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్  *శుభాకాంక్షలు* అందజేశారు.

డాక్టర్ హెచ్.ఎస్.పాలెప్
అవార్డ్ అందుకున్న సందర్భంగా…. ఆయన సమీప బంధువు ఎల్ఐసి ఉద్యోగి పాలెపు చంద్రశేఖర్ అందించిన అభినందన మందార మాలిక: 

పాలెపు వంశంబున పరిమళించిన కుసుమంతెలుగు నేలపై  ఉదయించిన కిరణంమహారాష్ట్రకు ప్రసరించిన      కాంతి పుంజం…మీరందించిన వైద్యసేవలు              అద్వితీయం…ఆయుర్వేద వైద్య పరిశోధన               అమూల్యం..మీ వృత్తి నిబద్దత, నిజాయితీ               అమోఘం….

మీ వైద్యసేవలు గుర్తించిన కేంద్రం పంపింది ఆహ్వానం       అందించెను”జీవన సాఫల్య పురస్కారం”…

అంతర్జాతీయ కీర్తి గడించడం మహా అద్భుతం…మీ కీర్తి అనంతాకాశం… మీ సేవలు స్ఫూర్తిదాయకం…        మరెందరికో ఆదర్శం… పాలెపు వంశానికే        గర్వకారణం …

అందుకోండి మీ పాలెపు వారి  అభినందన మందారం…
-పద్మావతి చంద్రశేఖర్ పాలెపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here